వ్యాపారం ఎందుకు చేద్దామనుకుంటున్నారు?

Updated: Jul 27, 2021జీవితం లో ఏదైనా సాధించాలంటే, ఎందుకు సాధించాలో ముందు అర్ధం చేసుకోవాలి.


అందరూ ఎదో ఒకటి చేస్తున్నారు కాబట్టా? లేక ప్రతి నెలా ఖర్చులకి కావలి కాబట్టా? లేక సమాజం లో గుర్తింపు కోసమా?


ఈ విషయం లో స్పష్టత కొరవడితే, మనం చేసే పని కూడా అలాగే కుంటుతూ నడుస్తుంది. స్పష్టత లేనప్పుడు ప్రతి చిన్న సమస్యకి మనం చేసే ప్రయత్నాన్ని ఆపేస్తుంటాం.


కాబట్టి ఏమి సాధించాలో నిర్ణయించుకునే ముందు, ఎందుకు సాధించాలో మనకు మనమే ఏకాంతం గా ఉన్నప్పుడు ఒక కాగితం మీద రాసుకొని చదువుకోవాలి. మనం సాధిద్దామనుకునేది ఇందుకోసమేనా అని ఒకటికి నాలుగు సార్లు ప్రశ్నించుకోవాలి.


ఇక్కడ తొందరపడవలసిన పని ఏమి లేదు. ఇక్కడ ఎంత సమయం వెచ్చిస్తే, మున్ముందు అంత సమయం, శక్తి ఆదా అవుతుంది.


లోతుగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనుమానం వస్తే, మీ తల్లి తండ్రులని గానీ, మీకు పాఠాలు చెప్పిన గురువులను గాని, ఇంకా ఎవరైనా వ్యాపారం లో అనుభవం ఉన్నవాళ్ళని, మీ గురించి తెలిసిన వారిని అడగాలి.


ఎందుకంటే, ఈ నిర్ణయం,కారణం దృఢంగా లేకపోతే, దీనిమీద నిర్మించే ఆశల సౌధం ఎప్పుడైనా కుప్ప కూల వచ్చు.

12 views0 comments