డిజిటల్ మీడియా సహాయంతో దూసుకెళ్తున్న అంకుర సంస్థ

డిజిటల్ మీడియా ను ఉపయోగిస్తూ అతి త్వరగా మార్కెట్ లో తన స్థానాన్ని నిలదొక్కుకున్న ఒక అంకుర సంస్థ కథ.
తనకున్న వాటర్ ప్యూరీఫైర్ వ్యాపారం ద్వారా ఆదాయం సరిపోక, హైదరాబాద్ కు చెందిన శ్రీ రాకేష్ ముంగేల్కర్, సొయా వ్యాపారం లోకి రావడం మూడేళ్ళ క్రితం జరిగింది. సొయా పప్పు తో చేసే పాలు, పనీర్, బిస్కెట్లు రానున్న కాలం లో ప్రాచుర్యం లోకి వస్తాయని ముందే ఊహించి, మధ్య ప్రదేశ్ లోని వార్ధా లో తగిన శిక్షణ పొంది తన సొయా వ్యాపారం మొదలు పెట్టాడు.
కానీ డిజిటల్ మార్కెటింగ్ తెలిసే వరకూ తన ప్రోడక్ట్ గురించి మార్కెట్ కి తెలవడమే కష్టం అయిపొయింది. తాను TENNIndia ని కలవరం ద్వారా, తనకు ఒక డిజిటల్ గా అటు తక్కువ ఖర్చు తో అందరితో పంచగలిగిన, కంటెంట్ తయారైంది.
కానీ అనుకోకుండా కరోనా రావడం, వ్యాపారాలన్నీ అస్తవ్యస్తం కావడం తోటి తన ఆశలన్నీ అడియాశలవుతాయన్న భయం తోటి వినూత్నంగా ఏదైనా చెయ్యాలని ఆలోచించాడు రాకేష్.
ఆన్లైన్ శిక్షణ తరగతులు మొదలు పెట్టి తాను చేస్తున్న పనిని ఎప్పడికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు. అనుకోకుండా ఒక రోజు, ఉత్తర భారత్ లోని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, తన కంటెంట్ నచ్చి తన వీడియో ని వాళ్ళ ఛానల్ లో పెట్టడం తో తన వ్యాపారం ఊపందుకొంది.
అప్పడినుంచి తన వెనుతిరిగి చూడలేదు. కరోనా లాక్ డౌన్ కాలం లో కూడా తన ట్రైనింగ్ క్లాసులతో తన వ్యాపారాన్ని కొనసాగించి నిలదొక్కుకున్నాడు. ఈ రెండేళ్ల కాలం లో 600 మందికి శిక్షణ ఇవ్వగా దాంట్లో 40 మంది తమ సొంత యూనిట్లను పెట్టుకునేలా ప్రోత్సహించి తనతో పాటు ఇంకొందరికి స్వయం ఉపాధి కలిపిస్తున్నాడు.
తన ఈ రెండేళ్ల ప్రయాణాన్ని తన మాటలలో వినండి: