ప్రోడక్ట్ తయారు చేయడమా ?? సేవలు అందించడమా ??




స్టార్ట్అప్ చేద్దామనుకున్న ప్రతి వారికి వచ్చే సందేహమే ఇది. దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి.


ఒక సర్వీసెస్ కంపెనీ పెద్దగా పెట్టుబడి లేకుండా తమ వినియోగదారులకు విశేషమైన సేవలందించి అందరి మన్నలనూ, ఆదాయాన్ని ఆర్జించ వచ్చు. ఎంత పోటీ వచ్చినా వాళ్ళ వినియోగదారులు ఎక్కడికీ పోకుండా చూసుకోవచ్చు.


అలాగే మార్కెట్ లో చాలా మందికి అవసరమున్న ఒక ప్రోడక్ట్ ని అయినా లాంచ్ చేసి విజేతగా నిలువ వచ్చు.


మీకు సొంత వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచన వచినప్పడినుండీ, మీ చుట్టూ జరుగుతున్నవ్యాపారాలనీ, రెండు మూడేళ్ళ క్రితం వ్యాపారం పెట్టి, విజయవంతం గా నడిపిస్తున్న వారూ, పోగొట్టుకున్నవారూ ఇద్దర్నీ మీరు క్షుణ్ణం గా పరిశీలించాల్సి ఉంటుంది.


మీ కుటుంబం లో మీరు ఫస్ట్ జనరేషన్ ఇంటర్ప్రెన్యూర్ అయితే, మీరు వ్యాపార ప్రపంచాన్ని గురించి ప్రతిరోజూ ఆసక్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. హార్డ్ వర్కర్ ల నుండి స్మార్ట్ వర్కర్ ల దాకా, మీకు రోజూ ఎదురైయ్యే ప్రతి మనిషినీ చదవాల్సి ఉంటుంది.


మీ చుట్టూ ఉండే వారికి మీ ప్రవర్తన కొంచం ఇబ్బందిగా ఉండవచ్చు..కానీ మీరు మీ గమ్యం చేరాలని అనుకుంటే, మీ పని మీరు చేసుకొంటూ పోవాలి.


మీరు ప్రోడక్ట్ లాంచ్ చేయ దలచుకున్న లేదా మీ సంస్థ ద్వారా విశిష్టమైన సేవలు అందిచ దలచుకున్నా, అనుభవజ్ఞులైన వారితో చర్చించి ఒక నిర్ణయానికి రావడం చాలా ముఖ్యం.


మీరు చేయ దలచుకున్న స్టార్ట్ అప్ గురించి మీరు మమ్మల్ని ఇమెయిల్ ద్వారా సంప్రదించి, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


మా ఇమెయిల్: tennindia@hotmail.com


12 views0 comments