ఏ రంగం లోకి వెళ్ళాలి - మార్కెట్ సైజింగ్ ప్రక్రియ & మార్కెటింగ్

సొంత వ్యాపారం పెట్టేవారందరు ఒకేలా ఉండరు. ఎలా ఉంటారు?
కొందరు వ్యాపార కుటుంబాలనుంచి వస్తారు. వీరికి కుటుంబ వ్యాపార అనుభవం తోడవుతూ ఉంటుంది. ఇంకొందరు వ్యాపార కుటుంబం నుండి రాకపోయినా, తల్లి తండ్రులు, తాతలు ఆస్తిపరులు అవడంచేత, మూలధనం కి ఏమి కొరత ఉండదు.
కొన్ని వ్యాపారాలకు ఇన్నోవేషన్ లేదా సృజనాత్మకత అవసరం ఉండదు. ఉదాహరణకు హోల్సేల్, స్టాకిస్టు, C & F, రైస్, పప్పు, పిండి, రవ్వ మిల్స్, డైరీ వ్యాపారం, పెట్రోల్ పంప్ dealership, గ్యాస్ ఏజెన్సీ లాంటి వాటికి కేవలం గట్టి ఆర్ధిక కుటుంబ నేపధ్యం ఉంటె సరిపోతుంది.
అయితే మార్కెట్ లో లేని ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రవేశపెట్టే టప్పుడు ఇన్నోవేషన్ అవసరం తప్పనిసరిగా అవసరం అవుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా గానీ, లిజ్జత్ పాపడ్ గానీ, ID ఇడ్లి పిండి గానీ, లయన్ ఖజ్జూరా కానీ, 'ఛోటా భీం' కార్టూన్ తయారు చేసిన మన హైద్రాబాదీ కంపెనీ గ్రీన్ గోల్డ్ అనిమేషన్ కానీ పెద్దగా పెట్టుబడి గానీ, ఆర్ధిక బలం అవసరం లేని కంపెనీలు.
కాబట్టి ఈ గ్రూప్ లో చర్చ ఆంతా సృజనాత్మకత తో విశ్వ విపణిలో స్థానం ఎలా సంపాదించాలనే ఉంటుంది.
దీనికి కావలసింది దూరదృష్టి, సహనం, మార్కెట్ రీసెర్చ్ చేసే ఆసక్తి కలవారు - కేవలం డబ్బు ఉంటె సరిపోదు. ఒక్కోసారి, డబ్బు ప్రాముఖ్యత అస్సలు ఉండక పోవచ్చు.
ఇక్కడ భారత వ్యాపార చరిత్ర లోనే అతి పెద్ద కంపెనీ అయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగిన తర్వాత, ఈరోజు పరిస్థితి చూస్తే మీకే అర్ధమవుతుంది...వ్యాపారం చెయ్యడానికి కావలసింది కేవలం డబ్బా? లేక నైపుణ్యామా?
మొదటి తరం వ్యాపారం లోకి దిగే వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిస్క్ మానేజ్మెంట్ సరిగా చేసుకోవాలి. అంటే మార్కెట్ సైజు ఎంతో ఖచ్చితం గా తెలుసుకోవాలి. మీరు అందించబోయే ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ ప్రజలకు (అంటే కొనబోయే వారికి) నిజంగానే అవసరం ఉందా? మీరు ఎవరినన్నా కలిసి ఈ విషయం గురించి చర్చించి, వారి అభిప్రాయాన్ని ఎక్కడైనా రాసుకున్నారా ?
కనీసం ఒక వంద మందిని (టార్గెట్ కస్టమర్లని) అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక దగ్గర నోట్ చేసు కున్నారా? మీరు ఇచ్చే ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ వాళ్ళు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి సిద్ధం గా ఉన్నారా?
ఈ పనిని ఎవరైనా ఇంటర్న్ లకి కానీ, ట్రైనీ లకి కానీ, టెలి కాలర్ లకి కానీ ఇచ్చి చేయించారో, అంతే సంగతులు.
ఇలాంటి విషయాలు కంపెనీని స్థాపించేవారే స్వయంగా మార్కెట్లో తిరిగి తెలుసుకోవాలి.
#marketresearch #marketing #sales #salesforce #salesTeams #communications #marketsize