నిరంతర శిక్షణ యొక్క ప్రాముఖ్యత

చిన్న వ్యాపారం నగరం ఎల్లలు దాటి, ఇతర నగరాలకు, దేశ విదేశాలకు వెళ్లాలంటే, కంపెనీ ప్రమోటర్లు నిరంతరం విశ్వ విపణిలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి.
నాణ్యత గలిగిన వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటూనే ఉంటుంది. ఎలాగైతే క్రీడా రంగం లో ఉండే వారు, కళల రంగంలో ఉండేవారు నిరంతరం తర్ఫీదు పొందుతూ ఉంటారో, కోచ్ లేదా గురువులని పెట్టుకొని మరీ కోచింగ్ తీసుకొంటూ ఉంటారో, అలాగే వ్యాపారం చేసే వారూ, వ్యాపారం స్థాపించ దలచుకున్న వారు, నిరంతరం శిక్షణ పొందుతూనే ఉండాలి.
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి:
1 ) పుస్తకాలు, పేపర్ లో వచ్చే వ్యాపార వార్తలు అనుదినం ఒక గంట సేపు కి తక్కువ కాకుండా చదవడం, ఆన్లైన్ లో వచ్చే వెబినార్లు, ఉచితం గా వచ్చే క్లాసుల ద్వారా మీకు కావలసిన అంశం మీద అవగాహన పెంచుకోవడం.
2 ) బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళు నిర్వహించే శిక్షణ తరగతులు గాని, నెట్వర్కింగ్ సెషన్స్ గానీ శ్రద్ద తో నిరంతరం పాలు పంచుకొంటూ ఉంటే, ఒక సంవత్సరం లో మీలో మార్పు మీకే అర్ధం అవుతుంది.
ఇదంతా ఎప్పుడు వీలవుతుందంటే, స్టార్ట్ అప్ పెట్ట దలచుకున్న వారు, ఒక దృఢమైన నిర్ణయం తమ స్వంతంగా తీసుకున్నప్పు మాత్రమే.
ఒక సైనికుడు ప్రతి రోజూ డ్రిల్ల్ చేసేది, క్రమ శిక్షణ తో ఉండేది ఆలా సంవత్సరాలు నిరంతరం చేసేది కేవలం ఒక రోజు రాబోయే యుద్ధం కొరకు. అది కొందరి సర్వీస్ లో రాకుండానే రిటైర్ అయ్యి పోవచ్చు గాక. కానీ వాళ్లెప్పుడూ సిద్ధం గానే ఉంటారు. యుద్ధం ప్రకటించిన తర్వాత శిక్షణ మొదలు పెట్టరు. అలాగే నిరంతర పరిశ్రమకీ, నేర్చుకోవడానికి సిద్ద పడే వారే వ్యాపార రంగం లోకి రావడం మంచిది.