సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వర్గీకరణ
MSME మంత్రిత్వ శాఖ నూతన నిర్వచనం ద్వారా, పరిశ్రమలను ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
1. సూక్ష్మ - పెట్టుబడి ₹1 కోటి కంటే తక్కువ మరియు ఒక సంవత్సరం లో టర్నోవర్ ₹5 కోట్ల కంటే తక్కువ.
2. చిన్న - పెట్టుబడి ₹10 కోట్ల కంటే తక్కువ మరియు ఒక సంవత్సరం లో టర్నోవర్ ₹50 కోట్ల కంటే తక్కువ.
3. మధ్య తరహా - పెట్టుబడి ₹20 కోట్ల కంటే తక్కువ మరియు ఒక సంవత్సరం లో టర్నోవర్ ₹100 కోట్ల కంటే తక్కువ.
Classification of industries
1. Micro enterprise - Manufacturing & Services - Investment <₹1 crore and turnover < ₹5 crores
2. Small Enterprise - Manufacturing & Services - Investment < ₹10 crores and turnover < ₹50 crores
3 Medium Enterprise - Manufacturing & Services - Investment <₹20 crores and turnover <₹100 crores
స్వయం ఉపాధి లేదా చిన్న పరిశ్రమలు మొదలుపెట్టే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:
-
మీరు చెయ్య బోయే వ్యాపారం లో మీకు తప్పనిసరిగా మార్కెటింగ్ లేదా సేల్స్ అనుభవం ఉండాలి. లేదంటే మీ వ్యాపారం మొదటి సంవత్సరమే మూతబడుతుంది. దీనిలో ఏ మాత్రం సందేహం లేదు.
2. ఒక వేళ మీరేదయినా ప్రోడక్ట్ లేదా వస్తువు తయారు చేస్తుంటే, అది చెయ్యడం లో మీకు కొంత అనుభవం ఉండాలి. (అగ్రి ప్రొడక్ట్స్ లేదా ఫుడ్ ప్రోడక్ట్ విషయంలో)
3. మీతో కలసి పనిచేయడానికి అనువైనవారిని వెతుక్కోవాలి. వాళ్ళకీ, మీకు మనస్పర్థలు వచ్చే అవకాశం అతి తక్కువ ఉండేలా చూసుకోవాలి.
4. మార్కెట్ లో అమ్ముడయ్యే వస్తువులనే తయారు చెయ్యాలి. దీనికి ముందుగానే, అంటే కనీసం ఒక ఆరు నెలలు మార్కెట్ లో పరిశోధన కంపెనీ పెట్టబోయే వారు స్వయంగా చెయ్యాలి. ఆన్లైన్ రిపోర్ట్ లు చూసి చాలా పెద్దే మార్కెట్ ఉందని ఊహించుకోవద్దు.
5. మీరు వ్యాపారం మొదలు పెట్టబోయే రంగం లో, ఇదివరకే చాలా మంది వివిధ రకాలైన ప్రయోగాలు చేసి ఉంటారు. జాతీయ లేదా అంతర్జాతీయ ప్రమాణాలున్న శిక్షణా సంస్థలలో శిక్షణ పొందడం ద్వారా, ఇలాంటివి ఎన్నో విషయాలు మీ దృష్టికి వస్తాయి.
అందుచేత మీకు అభిరుచి ఉన్న రంగంలో శిక్షణ ఎంతైనా అవసరం.
If you are looking to start your own enterprise either in services sector or in manufacturing sector,
please reach out to us for advisory and consulting services, so that you do not lost precious time in unfording your dreams.
#startupconsulting #startupideas #ideavalidation #marketresearch #businessplan #designthinking