
తెలుగు Entrepreneurs నెట్వర్క్ & న్యూస్ (TENN-India) -
The Startup consulting professionals.
రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు మరియు నిరుద్యోగ సమస్యకి సమాధానం సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల స్థాపనే.
రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు యువత , చిన్న ఉద్యోగాలతో జీవితాన్ని నెట్టుకు రావడం కష్టం అని అర్ధం చేసుకున్నప్పుడు , వారికి చిన్న వ్యాపార అవకాశాల గురించి సమాచారాన్ని వితరణ చేసే ప్రయత్నం.
విశ్వ విపణి లో అందరికీ అవకాశం ఉంటుంది. ఈ రోజు పెద్ద వ్యాపారవేత్తలు పదిహేనేళ్ల క్రితమో, ఇరవై ఏళ్ళక్రితమో చిన్నగా మొదలు పెట్టిన వాళ్ళే. వాళ్లు పడ్డ కష్టం కానీ, తిన్న తిట్లు గానీ ఎవరికీ తెలియవు.
కొత్త మార్గం లో పయనం మొదలిడినప్పుడు ఇబ్బందులు ఉంటాయనే తెలుసుకొని దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని బయలు దేరడం మంచిది.
దాదాపు 1500 సంవత్సరాల చరిత కలిగిన మన తెలుగు జాతి ఎన్నో పోరాటాలను, ప్రాణ త్యాగాలను చేసి మన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాము. చక్రవర్తులూ, రాజులూ, సామంత రాజులూ ఇప్పుడు లేరు.
ఇప్పుడు ఉన్నది వ్యాపారం చేసేవాళ్ళూ, ఉద్యోగాలు చేసేవాళ్ళు. వ్యాపారం లోకి వచ్చి, రోజు రోజుకీ పెరుగుతున్న అవకాశాలగురించి తెలుసుకొని, తదనుగుణంగా తమ ప్రణాళికల్ని మార్చుకో దలచుకున్న వారికి కావలసిన సమాచారాన్ని, శిక్షణను అందించే ప్రయత్నం.
తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకూ జయము. భారతావనికి జయము.